Friday, April 10, 2020

వీరాస్ "కవితా గానం" ( గాంధీ మార్గం)

కవితా గానం (గాంధీ మార్గం)


నిర్వహణ: వీరా గుడిపల్లి
సహకారం ః మెరుగు మధు
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు

✳️✳️✳️✳️✳️✳️✳️✳️
శ్రీ శార్వరీ నామ సంవత్సరం
చైత్ర మాసం *పౌర్ణమి* నగదు బహుమతుల పోటీ ఈరోజు
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
సమయం ః  *రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు*
************************
అంశం ః గాంధీ మార్గం

*ఈ నాటి సమాజానికి గాంధీ మార్గం ఎంత వరకు అవసరం ఎందుకు అవసరం.*
*ఎంతవరకు ఆచరణీయం అనే కోణంలో మీ కలాలకు పదును పెట్టండి.*
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣
వచన కవిత లైతే ఎనిమిది లైన్స్ పైబడి ,ఇరవై ఐదు వరుసలు మించకుండా రాయాలి
పద్యాలు లేదా మినీ లైతే కనీసం మూడు పద్యాలు తగ్గకుండా, ఆరు పద్యాలు దాటకుండా రాయాలి
*️⃣*️⃣*️⃣*️⃣*️⃣*️⃣ 
న్యాయ నిర్ణేత ః
*సర్ఫరాజ్ అన్వర్ గారు*
✳️✳️✳️✳️✳️✳️



[08/04, 8:00 PM] Ramaka: కవితాగానం
*******************
శ్రీ శార్వరీనామ సంవత్సర చైత్రమాస పౌర్ణమి నగదు బహుమతుల పోటీ
***********************

పేరు:డా.రామక కృష్ణమూర్తి
అంశం:గాంధీమార్గం
తేది:8-4-2020
శీర్షిక: సన్మార్గం

ఉద్యమంలో *అహింస* అవసరమని
నిరసనలో *సత్యాగ్రహం* ఆచరణీయమని
నడిచేమార్గం *శాంతి* మయం కావాలని
ఉద్రిక్తపరిస్థితుల్లో *సహనం* చూపాలని
అందరితో *సౌభ్రాతృత్వం* కల్గి ఉండాలని
*గ్రామాలే* దేశానికి పట్టుగొమ్మలని
*గ్రామస్వరాజ్యమే* అభివృద్ధికి బాట పరుస్తుందని
*స్వచ్ఛత* *పరిశుభ్రత* లు అత్యంత ఆవశ్యకాలని
*స్వయంసేవ* యే మానవుల కర్తవ్యమని
నిత్యం నీవు చేసే *ప్రార్థన* యే
శక్తినిస్తుందని
అన్నిపనుల్లో *క్రమశిక్షణే* ఉత్తమమని
చేసే పనుల్లో *నిబద్ధత* ఉండాలని
ప్రజల మధ్య *ఐక్యతే* శ్రీరామరక్షయని
జీవనం *నిరాడంబరం* గా సాగాలని
*దేశభక్తి* *దైవభక్తి* నీ ఆయుధాలని
*సంప్రదింపులు* *చర్చలు* సమస్యల‌ పరిష్కారానికి మార్గాలని
*న్యాయ* *ధర్మ* మార్గాలే సంప్రదాయాలని
*శాకాహారం* *సజ్జనసాంగత్యం* నిత్యకృత్యాలవ్వాలని
మార్గనిర్దేశనం చేసిన *గాంధీమార్గం* 
సదా అనుసరణీయం,వందనీయం.
[08/04, 8:01 PM] Aravinda Rayudu: చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీకి......

పేరు : #అరవిందరాయుడు
వేదిక: కవితా గానం
అంశం: గాంధీ మార్గం

శీర్షిక

#ఆత్మశక్తి


ఓ మహాత్మా...
అణుశక్తిని మించిన
ఆత్మశక్తిని దర్శించాలని ఉంది
ఉపదేశం చేయవూ...

మాటలకే పరిమితమైన
శుష్క ఎడారుల్లో
చేతలసేద్యం చేయాలని ఉంది
ఆశీర్వదించవూ...

హింసకునెలవైన సమాజంలో
పరమహంసనై
శాంతిని మాత్రమే ధరించాలని ఉంది
మార్గం చూపవూ...

ఆసేతుహిమాచల పర్యంతాన్ని
ఏకతాటిపై నడిపించిన
సమ్మోహనకరమైన
నీ చిరునవ్వు మంత్రదండ విన్యాసాన్ని 
వీక్షించాలని ఉంది
ఆవిష్కరించవూ...

త్యాగాన్ని పునాదిగా కదిలిన
రమ్య స్వతంత్ర్యభారత
హర్మ్య నిర్మాత ను
సాక్షాత్కరింప జేసుకోవాలని ఉంది

ఒక్కసారి...
ఒక్కసారి కనిపించవూ...


అరవిందరాయుడు దేవినేని
[08/04, 8:01 PM] Narendraswamy: *కవితా గానం:*
*అంశం: గాంధీ మార్గం*
*రచన:పసుపులేటి నరేంద్రస్వామి*
తేది:08-04-2020

‘‘నీతిలేని వాణిజ్యం, కృషి లేని సంపద, శీలం లేని విద్య, మానవత లేని శాస్త్రవిజ్ఞానం, నియమ నిష్టలు లేని రాజకీయం సామాజిక దురాచారాలు’’ అన్న గాంధీజీ సందేశం ఏ సమాజానికైనా ప్రాతఃస్మరణీయం. ఆయన ప్రబోధించిన అహింస అంటే భౌతికరూపంలోనిది మాత్రమే కాదు, తోటి మనిషిని మాటలతో కూడా గాయపరచకపోవడం! అనుద్వేగ కరం’’

అభివృద్ధి దిశలో సాగాలనుకునే సమాజానికి గాంధీజీ మాటలే దిక్సూచులు. దురదృష్టవశాత్తు నేటి సమాజం వీటికి దూరంగా ఉన్నా పాత ఫ్యాషన్ ఇప్పుడూ మళ్లీ మొదలైనట్లే
లోకాయుక్త కోసం అన్నా హజారే గాంధీ మార్గం పట్టి ఈ కాలంలోనే అందరినీ ఆలోచింపచేశారు, అదే మార్గంలోనే  కేజ్రీవాల్ 3సార్లు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇంకా ఏం జరుగనుందో
తప్పదు! 
 గాంధీమార్గం సమ సమాజ స్థాపన కై
[08/04, 8:03 PM] సంజీవ రెడ్డి ఐలేని: .. గాంధీ చూపిన మార్గం..
💐💐💐💐💐💐💐💐
అహింస సత్యాగ్రహం
ఆయుధాలు
నిరాడంబరం నిత్యకృషి 
జీవన సూత్రాలు
చెప్పింది చేయడం
చేసేది చెప్పడం
ప్రజలను మంచివైపుకు 
కార్యోన్ముఖులను చేయడం
గాంధీ తత్వం
మనుషులంతా సమానం
మానవతే ఆచరణీయం
ప్రకృతిని ప్రేమించు
పర్యావరణాన్ని కాపాడు
పరిశుభ్రత పాటించు 
ఆరోగ్యంగా జీవించు
నీ కర్తవ్యం నిర్వర్తించు 
తోటి వారికి సాయమందించు 
నీవు ఆచరించు
ఇతరులకు బోధించు 
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లు 
అనుకున్నది సాధించు 
సత్యం ధర్మం అహింస
మానవజాతికి శ్రీరామ రక్ష
గాంధీ చూపిన  ఈ మార్గం
నాడు నేడు ఏనాడైనా
మానవాళికి ఆచరణీయం
నేటి సమాజానికి
అదే రక్షణ కవచం

... సంజీవరెడ్డి ఐలేని..
9177796464..
[08/04, 8:03 PM] Korada: పౌర్ణమి.....నగదు
    పురష్కారాలు
అంశం:-గాంధీ మార్గం
నేటిసమాజానికి...                   
       గాంధీ మార్గం !
కోరాడనరసింహా రావు .,శీర్షిక : అన్య దాశరణం నాస్తి...!
****************
సత్య మేవ జయతే!
అహింసా...పరమో ధర్మః...!
యివి వాక్యాలు రూపంలో వున్నదివ్య
శాస్త్రాలు...,సమాజాన్ని సన్మార్గంలోనడప
గలఅద్భుతాస్త్రాలు!!

సత్ ఫలితాల నిచ్చి చరిత్రను సృష్టించిన సాక్ష్య స్వరూపాలు !
ఇవి మహాత్ముడైన  గాంధీ అనుసరించిన
అత్యుత్తమమార్గాలు
తర,తరాల దాస్య శృంఖలాలను త్రెంచి 
స్వతంత్ర,స్వరాజ్యాలను తెచ్చి పెట్టిన సాధనా సంపత్తులు!
ఆ నాటికే కాదు ఈ నాటికీ...యేనాటికీ 
ఈప్రపంచానికిఆదర్శ
ఆచరణీయాలు...!!

అసత్య జాడ్యంతో  
అల్లాడుతున్నప్రపంచానికి...ఈ సత్యా హింసలే..   దివ్య ఔషధములు  !!
ఇది సహించలేని చే దు మందే...అయినా 
ఈ ఔషధాల  సేవనం తప్పవేరుఉపాయమే
లేదీ రోగానికి  !
నయానో ...భయానో 
ఈ మందును  స్వీక రింప  జేయవలసిందే
ఇప్పుడిప్పుడే మనిషి 
ఏదిసత్యమో...యేది 
నిత్యమో తెలిసి కొంటూ...తన అజ్ఞా నాన్ని  వదిలించు కో వాలనే  ఆలోచనలో  పడ్డాడు !వేడి మీద
 ఈ సమ్మెట  పోట్లు
పడాల్సిందే...!!
ఇదే సరైన సమయం 
సత్యా హింసల సత్తా ను బోధించి...అధర్మ 
అన్యాయ,హింసా...
దౌర్జన్యాల వికృత పరిణామాల విషాదాన్ని విశద పరచాలి !
ఈ సమాజాన్ని సత్యాహింసల ధర్మ మార్గంలో నడిపి నపుడే...ఈ ప్రపంచం
ఆనందమయ సుఖ జీవనంతో ...మన
గలుగుతుంది...!!
*****************
.........కోరాడ.
[08/04, 8:05 PM] Deshapathi Mohan: ✍️కవితా గానం :
దేశపతి మోహన్ శర్మ టీచర్ మెదక్ 
నేటి అంశం :గాంధీ మార్గం 
కవితా శీర్షిక : మహాత్మా! క్షమించు 

మహాత్మా !మమ్మల్ని క్షమించు 
మరోసారి భారతావని పై జన్మించు 
నీవు ఇచ్చిన ఈ స్వేచ్ఛా భారతం.. నేడు 
నీవు నడిపిన బాట విడిచి ..
నీవు నేర్పిన మాట మరచి..
మతానికి,మగువకు, మందుకు,బానిసై 
మారణ హోమాలు చేస్తున్నది మాతరం 
పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి 
పచ్చ నోటు పై నీవే సాక్ష్యంగా ఓటును 
అమ్మేస్తున్నది ..నా నవభారత జనం 
నీవు చెప్పిన అహింస ధర్మం తుంగలోతొక్కి 
హింసించైనా  అధికారం చేజిక్కించుకుంది.
నాటి యువతరం గాంధీ బాటకు ఉరకలెత్తగా
నేటి యువత బ్రాందీ బాటిల్తో ఊగుతుంది 
నాడు నీవు ఇచ్చిన స్వేచ్ఛ ...ఇప్పుడు 
ఎవడికి నచ్చినది వాడు చేసే ఇచ్ఛ 
అర్ధరాత్రి కాదు పట్టపగలే స్త్రీకి రక్షణ లేదు 
అవసరానికి సత్యాన్ని అసత్యంగా మార్చుట 
ఈ సమాజం దృష్టిలో తప్పు కాదు 
అసాంఘిక కార్యకలాపాలు సాగినా 
హత్యలు అత్యాచారాలు జరిగినా 
అడిగే నాథుడు లేడు ఆపే పౌరుడు లేడు 
అపరిశుభ్రజీవనాలు ఆకలికేకలుఇంకాఆగలేదు
అందుకే మహాత్మా  !మమ్మల్ని క్షమించు 
మరోసారి.. నీకర్రతో కొట్టైనామాలో మార్పుకు
ప్రయత్నించుటకు మళ్లీజన్మించు  

రచన సంఖ్య @298
[08/04, 8:05 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*

*శ్రీ శార్వరీనామ సంవత్సర చైత్రమాస పౌర్ణమి నగదు బహుమతుల పోటీ*

అయిత అనిత
అంశం : గాంధీమార్గం
తేది: 08.04.2020
శీర్షిక: *మారదా...లోకం!*

చిన్నప్పటి కథల పుస్తకపఠనమే వ్యక్తిత్వానికి పునాది!
సత్యహరిశ్చంద్ర నాటకమే సత్యశోధనకు నాంది!

రైలుప్రయాణపు అవమానమే అంతరాలను రూపుమాపే ప్రేరణ అయ్యింది!
జాతివిక్షతను సంహరించే అహింసా ఆయుధమయ్యింది!!
అతడో నిరాండబరుడు  శాంతికాముకుడు!

చెడు కనవద్దు వినవద్దు పలుకవద్దన్న హితబోధకుడు!
మనపనులు మనమే చేసుకోవాలన్న కర్మసిద్దాంత ఆచరణీయుడు!
ఒక చెంపపై కొడితే మరో చెంపచూపే సహనశీలుడు!

హిందూముస్లింల సఖ్యతనాశిస్తూ...
సంపూర్ణ స్వరాజ్యంకై జీవితాన్నే అంకితమిచ్చిన ఘనుడు!

నేడు! దుర్మార్గాలే రాజ్యమేలుతున్న భువిని
రామరాజ్యం గా మార్చే మహాత్ముడు కావాలి!
ఓ...బాపు మరలా రా! మాకు మీ సిద్ధాంతాలు ప్రబోధించగ దివినుండి దిగిరా!!

నీ మార్గదర్శనమే మాకు దారైతే
నీ సహనసౌశీల్యాలే మాకాదర్శమైతే
నీ సంకల్పమే మాకు మంత్రమైతే
మారాదా లోకం నీ చరితను గాంచి...!ఓ మహాత్మా!!

హామిపత్రం
ఇది నా స్వీయరచన
దేనికి అనువాదం కాదు
ఎక్కడా ప్రచురించబడలేదు
[08/04, 8:07 PM] +91 94941 62571: అంశం..గాంధీమార్గం
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు

గాంధీమార్గం అందరికి ఆదర్శనీయమైనది ఆచరణీయమైనది
సత్యం అహింసా శాంతి సహనం వంటి గుణాలతో మానవసమాజం మెలగాలి అప్పుడే గాంధీకి వారసులం అవుతాం
అవినీతి సమాజంలో పెరిగిపోయింది ప్రేమ ఆప్యాయత తగ్గిపోయింది ఎవరికి వారే యమునాతీరే అన్న చంధంగా ఉన్నారు.మనిషి నీతిగా బతకాలని స్వయం కృషితో సంపాదించాలని ఉన్నదానితో తృప్తి చెందాలని అన్నాయాన్ని అధర్మాన్నికి మౌనం వహించకుండా శాంతియుత మార్గం ద్వారా ఎదుర్కొని సమస్యను సామరస్యంగా పరిష్కారించాలని సమాజానికి సూచనలు చేసారు గాంధీ మార్గదర్శకాలు నేటి తరానికి ఆదర్శం అందువలన అవినీతిని దండోపాయం ద్వారా కాకుండా అహింసా మార్గం ద్వారా సాధించాలని గాంధీజీ చెప్పారు దేశంలో ప్రజలు కులం మతం వర్గబేధం లేకుండా మెలగాలని ఐక్యతతో మెలగాలన్న గాంధీ మార్గం ఎంతనై నేటి జనులకు అవసరం
గాంధీమార్గం మనకు వేదం అదే భారతదేశానికి నవీదయం

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
హామీపత్రం
ఈకవిత నా స్వీయరచన ,దేనికి అనువాదం అనుసరణకాదని హామీఇస్తున్నాను

సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
కామారెడ్డి
[08/04, 8:08 PM] Satish Kumar Palugula Poet: అంశం: గాంధీ మార్గం
******************
గాంధీ చూపిన మార్గం
ప్రపంచ శాంతికి శ్రేయోమార్గం
ప్రపంచ పగతికి శిరోధార్యం

జాతివివక్షతో దక్షిణాఫ్రికాలో
రైలు నుండి తోసివేయబడిన చేదు అనుభవంతో
ప్రారంభమైన జాతివివక్ష వ్యతిరేకపోరాటం
పట్టుదలతో సామాన్య న్యాయవాదినుండి
ప్రపంచ ప్రజల ఆరాద్యుడిగా అవతరణం

కష్టాలెన్ని ఎదురైనా
విజయం సాధించాలనే ధీరత్వం
సహనం, ఐకమత్యం, అహింసలే ఆయుధాలుగా
అభేద్యమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చుటకు
గాంధీ నడిపిన మహోజ్వల స్వాతంత్ర్య సంగ్రామం
తరతరాలకు ప్రపంచానికి స్పూర్తి దాయకం

ప్రపంచమంతా యుద్ధం కాంక్షతో
జాతుల అంతర్యుద్ధం, మతోన్మాదంతో
బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న వేళ
గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గం
యుద్ధం, మతోన్మాదాలనెదిరించే వజ్రాయుధం

మతోన్మాదంతో రాళ్లు కర్రలు పెట్రోల్ బాంబులతో పరస్పరం
దాడులు జరుపుకుంటున్న
దౌర్భాగ్యపు వేళ
" ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్" అని
బాపు ప్రవచించిన సమభావనామంత్రం
సేవ, ప్రేమ,కరుణలు గుండెలనిండా ఉన్నప్పుడే
' భగవత్ సాక్షాత్కారం' అనే భోధామృతం
సర్వమానవాళికి క్షేమదాయకం

పలు సంక్షోభాలు ఉద్బవిస్తున్న
నేటి తరుణంలో
గాంధీ చూపిన
సర్వమానవ సౌభ్రాతృత్వం
నిరాడంబర జీవనవిధానం
సత్యం, అహింసా మార్గాల ఆచరణే
సంక్షోభాల నిర్మూలనకు శ్రేయోమార్గం.

---------- పి. సతీశ్ కుమార్
[08/04, 8:09 PM] కందూరి సుజాత Poetess: శీర్షిక  ...గాంధీ మార్గం
వచన.. కవత
____________
గాంధీ మార్గం ఘన సంగ్రామం/
భారతావని కీర్తి కిరీటం -
పోరుబందరు పొత్తిలి కెరటం గాంధీ/
చదువుల నేర్పిన సంస్కారం -  
సఖ్యత చేయగా ఆస్కారం /
నిరాయుధ ఉషాకిరణం -
స్వరాజ్య నినాద కిశోరం గాంధీ/
గాంధీ రూపం శాంతిప్రదానం -
గాంధీ మార్గం సత్యవికాసం /
అదే అదే..గాంధీ మార్గం /

అన్వాయుధ మెరుగని దేశం నాడు -
కడలిని మించిన ఆశలు  -
కాలు చాపని కాంక్షలు  /
ఉపేక్షించని ఉత్పాతమే సత్యాగ్రహము / తూటకు దీటుగా గుండెను నిలిపి/ 
ఆత్మస్థైర్యమును,ఐక్యతగా మలచి /
స్వతంత్ర కాంక్షన,సత్యాగ్రహ -
దీక్షలువలచి/
దేశమాతనే కొలచిన,గాంధీ మార్గం/

అహింస పానుపు ఆశ్రయించి -
స్వేచ్ఛ తలగడ పొదిపి పట్టిన -
ప్రణాళికా పంజా /
సత్యము విల్లుగా,ఐక్యత బాణం వదిలిన కొమ్ములు లేని కొదమసింహం /
ఉద్యమాలే ఊపిరిగా -
శ్వేత జాతులను తరిమిన -
గర్జన చేయని గజముఖము /
అలికిడి చేెయని,పిడికిలి తత్వం -
అదే అదే గాంధీ మార్గము  /
 
నాడు నేడు ఉగ్రతాండవము  -
అధర్మఖాంఢపై /
ధర్మ రక్షణకై తప్పని సత్యాగ్రహం /
హింస చర్యలకు,అహింస కార్యములు అత్యవసరము /
సత్యాగ్రహము ఉపనామం -
సత్యమేవజయతే ఉపశమనం,అనునది      నేటిసమాజంన ఆచరణీయం మిథ్యా/
                  (అయినా)
"గాంధీ మార్గం నవజీవన తార్కాణం"

కందూరి సుజాత గౌడ్ 
రాజంద్రనగర్ ,HYD 
9392162822
[08/04, 8:09 PM] Muvva Prasad: గణతంత్ర రాజ్యము లో గాంధీమార్గము 

ప్రజాస్వామ్య దేశములో ప్రజలే పాలకులా ?

ఉచితాలు ఉవ్వెత్తున వెల్లువెత్తి ప్రగల్భాలు ప్రదర్శించే పార్టీలు ప్రజలముందుకు వస్తుంటే?

 ఆశకూ అంతులేక అణగారిన వర్గాలన్నీ ఓట్ల పండగకు ఉరుకెత్తి ఓట్లేస్తే!

పీటమెక్కిన పాలకులు నిరాడంబరతకు నీళ్ళువదిలి ఆడంబరాలను అందలమెక్కించి 
ప్రచారాలకు ప్రాకులాడుతూ 

సంస్కరణలు సంగతే మరిచి 
 ఆర్థిక స్థితి అంటకాగిస్తుంటే !

 అత్యున్నత మేధావులు విద్యావేత్తలు  అలసత్వము వహించి ఊరుకుంటె గణతంత్రదేశములో గాంధీమార్గమొచ్చునా ?

 ఉపాధిని చూపించని విద్య మారకుంటే ఉత్పాదకత పెరుగునా ?
 
వృత్తివిద్యా 
విద్యావిధానం విస్తృతము చెయ్యాలన్న గాంధీ మార్గమే గార్హహనీయము .

ఉమ్మడికుటుంబాలు ఊసేలేకుంటే  నీతికథలు భోదించే  నాయనమ్మలు కరువాయె !

అంతులేని హింస అసత్యాలే సత్యాలౌతూ క్రమశిక్షణ కనుమరుగౌతుంటే !

ప్రపంచములోనే పలువురు గాంధీమార్గం గాడిలోపడి సాధించిన సంగతులెన్నో సత్తువున్న నీకు తెలియదా ?

జీవహింసతో జన్మించిన వైరస్ విశ్వమంతా వ్యాపించి కరోనా తో కరాళ నృత్యం చేస్తుంటే!

 అహింసో పరమ  ధర్మః  అన్న గాంధీ మార్గము అవసరం కదా ?

గాంధీ మార్గమెప్పుడు గర్జించే రోజొస్తుందా అని గమ్మునుండకు  .

 కదనరంగమున కాలిడి నీవొంతుగా నిల్చోరా !

మేధావి మౌనాన్ని వీడి మస్తిష్కాన్ని మధించు 

గగనమంతా నీదే గాంధీమార్గాన్ని గాడిన పెట్టడానికి . 

మువ్వా ప్రసాద్
[08/04, 8:09 PM] కె. సత్యనీలిమ 

వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *గాంధీ మార్గం*

నాడు మనదేశపరిస్థితుల దృష్ట్యా
ఎందరో త్యాగమూర్తులు,దేశభక్తులు
తమ ప్రాణాలను ఫణంగా పెట్టి
స్వరాజ్యం తీసుకువచ్చారు
గాంధీజీ అహింసయే తనమార్గమని
సత్యమే తన ఆయుధమని
ఎలాంటి హింసాయుత చర్యలకు
పాల్పడకుండా శాంతియుతంగా
స్వాతంత్ర్యం కోసం
పోరాటం సలిపాడు
ఇప్పుడున్న పరిస్థితులలో
గాంధీజీ కనుక ఉండిఉంటే
తనమార్గంలోనే నడిచేవాడా
నాడు విదేశీయులు మనదేశాన్ని దోచేస్తే
నేడు స్వదేశీయులే మనదేశాన్ని దోస్తున్నారు
ఇన్ని అక్రమాలు, ఆక్రందనలు చూసి
కన్నీళ్లు పెట్టుకునేవాడు
ఇదేనా సాధించింది అని వాపోయేవాడు
అయినా కూడా తనమార్గాన్ని
వదిలేవాడేకాదు
అందరినీమార్చి నిజమైన
స్వరాజ్య రామరాజ్యంగా
భారతదేశాన్ని మార్చేవాడు
బాపూజీ ఒక్కసారి
మళ్ళీ జన్మించు

*సత్యనీలిమ*
[08/04, 8:10 PM] అంబటి Bhanu Prakash: 🙏🌿🌷🌿🌿🌷🙏

     *కవుల వేదిక*

అంబటి భాను ప్రకాశ్
జోగులాంబ గద్వాల జిల్లా
9948948787.
నేటిఅంశం:-గాంధీ మార్గం.
08.04.2020.

✒️🌷✍️
కం.
దారిని జూపిన వాడే
తీరుగ మహనీయుడౌను ధీయుతుడగుచున్
కారణ మేమైన పుడమి
కూరిమి చూపించి నడుచు కోమలమనమున్

కం.
సత్యము నహింస సేవయు
నిత్యము తానమ్మి నడిచె నిండుమనముతో
భృత్యుడ మీకౌదు ననుచు
నిత్యము గీతోపదేశ నియమైనడచెన్

సీ.
హే రామ!యనిపల్కి భారతీయుల నంత
       స్వాతంత్ర్య సిద్దికై సాగజేసె
హింసను విడనాడ హింను బోధించి
      యాచరించియు జూపె నవని యందు
జైలు శిక్షలయిన జనుల మేలునుగోరి
       కష్ట మనక నొందె యిష్ట మనియె
దేశీయ వస్త్రముల్ తీరుగా ధరియించి
        పరదేశి వలువలన్ వదులు మనియె

ఆ.
జాతిపితగ తాను జాగ్రత దెల్పిన
నాచరించి జూపు నాపదనక మన
బానిసత్వ మన్న బాపెలేబాపూజి
విశ్వ కీర్తి నొంది వెలిగి నాడు

కం.
తప్పుడు మార్గము నడచుచు
ముప్పునుగొనితెచ్చు కొనుచు మూఢులుతామై
గొప్పగ నీతులు వదరుచు
ముప్పై నిలుచుండి రిపుడు మోసముచేతన్

కం.
యువతే దేశపు సంపద
యువతీ యువకులకు గాంధి యుక్తులుదెలిపీ
రవులై వెలుగులు బంచిన
భవితే బాగుండు దేశ భావితరాలున్!!

కం.
రావలె గాంధీ యొక్కడు
పోవలె,హింసా,మతులును పూర్తిగనిలపై!
చేవను బెంచెడు వాడై
జీవింపగనేర్పవలెను జేగీయముగన్!!


🌿🌷🌿🌷🌿🌷🌿🌷
[08/04, 8:11 PM] Tagiran: శ్రీ శార్వరీ నామ సంవత్సరం 
అంశం : గాంధీ మార్గం 

*నిత్తెసత్తెపునడక*

బక్కపల్చని పెయ్యి ..ఐతేనేం 
లోన నిప్పై ఎగిసే ఉక్కుసంకల్పం..
పనులన్నిట చిరుతపరుగు వేగం..
కార్యసిద్ధికై కదనమందు"అహింసకొదమసింగం"..
"నిత్తెసత్తెపునడక" మహోజ్వలిత స్వేచ్చాగీతం .. 
         *** 
ఆస్థులకొరకో .. అతిచిన్న విషయాలకో ..
ఆత్మీయతలను దూరం చేసుకునే నేటి తరమా 
"జాతిని ఒక్కతొవ్వమీద, అన్నదమ్ముల్లా కలిపిన 
"జాతిపిత" నిజాయితీ ప్రతితరానికీ ఆదర్శమే! 
     ***   ***
సమస్యలపై పోరాటం పక్కనపెట్టి,
సమస్యలచిక్కులకు.. పిరికిదారుల తరాలకూ 
"బానిసబ్రతుకై, బ్రతుకే సాగని తీరును"
సత్య అహింసకాంతులతో వెలుగులు నింపి,
రవిఅస్తమించని సామ్రాజ్యదొరలకు 
పెనుచీకట్ల భయం చూపించి, 
సమస్యల్నే చిక్కుల్లో పెట్టి వెళ్లగొట్టిన 
ఆ "శాంతిదూత" తోవ సదా ఆచరణీయం..
     **  ** 
ఆగమాగమై సాగుతున్న తరాలకు..  
పాశ్చత్యపోకడలఆధునిక మానవయంత్రాలకు... 
"స్వదేశి విధానమే స్వర్గతుల్యమ"ని చూపిన 
ఆ జీవనమార్గమే విశ్వజగతికి మోక్షమార్గం.. 
యుగాలు మారినా, తరాలు మారినా, 
ప్రతీక్షణం..ప్రతిఒక్కరికీ.. ఆదర్శగీతమై, 
ప్రతిహృదయంలో చైతన్యసవ్వడై సాగుతూ,
జీవనగమనమై పాడుతూనే ఉండాలి .. 
     **** 
                  ------  తగిరంచ నర్సింహారెడ్డి 
                              9912119901
[08/04, 8:11 PM] అనుముల తేజస్విని Poetess: కవితా గానం
************
చైత్రమాస పౌర్ణమి నగదు కవితల పోటీ

అంశం:గాంధీ మార్గం
శీర్షిక:బాపు మార్గం
తేదీ:8/4/2020

పేరు:అనుముల తేజస్విని
కలం పేరు:తేజస్
ఊరు:నర్సంపేట

ఆద్యంతం ఆచరణం
బాపు పిలుపుతో పరవసించేవాడు
మహాత్ముడిగా వెలుగొందినవాడు
ఆయన మార్గం శాంతి మార్గం
తానే అలుపెరుగని బాటసారి
మనకి చూపించాడు స్వాతంత్ర్య రహదారి
సత్యాగ్రహంతో దండిగా కదిలి
సమస్యల నుండి బయట పడేలా నేర్పాడు
ఒక అడుగుతో వేల అడుగులు వేసేలా 
చేసాడు
నిరంతర కార్యజీవి
ఆయనే మనకు సూత్రధారి
తన జీవితమే సత్యశోధనగా తెలిపాడు
ఎన్నో తరాలకు ఆదర్శమయ్యేలా
వారసులకు వారధిలా
తన జీవిత ప్రయాణము కష్టనష్టాల సమ్మిళితమై
ప్రజలకు సన్నిహితమై
హితమును బోధించాడు
అహింస, శాంతి తన ఆయుధాలు
అవి నేటి వారికి ఆదర్శాలు
తన శారీరక ఆరోగ్యం
కాపాడుకునే విధం
కడు శోచనీయం
పరాయి వాడి పాలనలో నీచపు బతుకులకు
విముక్తి కలిగించి, 
ఆనాడే స్వదేశీ వస్తువులే స్వచ్ఛతకు చిహ్నమని చెప్పాడు
గతానికి గతి
నేడు సమాజానికి స్ఫూర్తి
మన జాతిపిత శాంతిధూత
ఎన్నటికీ మరువని 
సత్ సన్మార్గాలు.....
[08/04, 8:14 PM] Purushottam Reddy Utf Poet: శీర్షిక:గాంధీజీ ఆవేదన
రచన:పైల పురుషోత్తం రెడ్డి
తెలుగు ఉపాధ్యాయులు
శ్రీకాకుళం జిల్లా
"గాంధీజీ ఆవేదన"
-------------------------
ఇదేనా నే కలలు గన్న భారతదేశం!
ఇవేనా నే పోరాడి సాధించిన స్వతంత్ర ఫలాలు!
ఎటు పయనిస్తున్నది నా దేశం!
కనుమరుగౌతున్నవి కదా!నా సిద్ధాంతాలు
నే కన్న కలలు కల్లలైన వేళ
క్షోభిస్తున్నది నా పవిత్ర హృదయం
నా భారతీయుల మనస్సుల్లో నిండుగా స్వార్థం
మానవతా విలువలు మృగ్యం
నా ప్రజల ఆలోచనల్లో పెరిగిన పాశ్చాత్య తత్వం
పడిపోయిన నైతికత్వం
విద్యార్థుల్లో గోచరిస్తున్న క్రమశిక్షణా రాహిత్యం
ప్రజల్లో క్షీణించిన నిజాయితీ నేస్తం
ఇదేనా నే కలలు గన్న భారతదేశం
మానవుని స్వార్ధమే ప్రకృతి ప్రకోపానికి కారణం
ప్రజలను కాటేస్తున్న కరోనా కర్కోటకం
సన్నగిల్లిన నా అహింసావాదం
దేశ ప్రజల జీవితాలు అశాంతిమయం
భావిభారత నిర్దేశకులైన నేటి విద్యార్థులారా
మేల్కొనండి!ఒక్క క్షణం ఆలోచించండి!
మీలో సహనం,సత్యం, సమభావాల్ని పెంపొందించుకోండి
ఆత్మవిశ్వాసంతో అన్నింటా ముందడుగు వేయండి
నే ఆశించిన నవ భారత నిర్మాణానికై నడుం బిగించండి
భారత జాతి పురోగతికై పాటుపడండి
క్షోభిస్తున్న నా ఆత్మకు శాంతిని చేకూర్చండి!
[08/04, 8:14 PM] Ganjam Bhramaramba: చైత్రమాసం పౌర్ణమి
కవితా గానం
గాంధీ మార్గం
8/4/2020

గాంధీ చూపిన సత్య మార్గం

గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918

హింసా ప్రతీకారాలతో
రగులుతున్న జనావళికి
అహింసామార్గాన్ని చూపిన
అసలుసిసలైన మానవతావాది

సత్యమేవ జయతి అంటూ
 ఆయన ముందుకు కదులుతూ
కోట్లమంది భారతీయుల నమ్మకాన్ని
తన వెనుకనడిపించిన దార్శినికుడు

భారతీయులందరూ పూలహారంలో ఒదిగిన 
విరులలా కలిసిపోయి గుభాళించాలని
మతాలువేరైనా మానవత్వమొకటేనని
తేల్చి చెప్పిన స్ఫూర్తి ప్రదాత

నిరాడంబరమైన జీవితం
ఏ పదవినీ ఆశించని త్యాగనిరతి
 కఠినమైన పరీక్షలలో మనోనిబ్బరం
కడవరకూ సడలిపోని ఆత్మస్థైర్యం

ప్రేమాభిమానాలు పెంపొందించేది
గాంధేయ వాదం
సహాయ సహకారాలను అందించేది
గాంధేయ మార్గం

గాంధేయ వాదం
తరతరాలకూ అనుసరణీయం
గాంధేయ మార్గం
నేటి తరానికి అత్యంత ఆవశ్యకం

శిలలలో..కరెన్సీ నోట్లపై కాకుండా
హృదయంలో ముద్రించుకోవాలి
 చిరునవ్వుల గాంధీజీ రూపాన్ని..
ఆచరించి చూపాలి గాంధీజీ తత్వాన్ని

🌹🙏🌹🙏🌹🙏🌹
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918
[08/04, 8:18 PM] పాల్వంచ హరికిషన్: గాంధీ మార్గమై..! 

దేశ విముక్తి కి తపన
సాగెను యుక్తి పథాన
అహింస ఆయుధమై
హింసకు ప్రతి హింస
అహింసే అని నేర్పిన
మహిమాన్విత వ్యక్తి
పిరికి వారిని ఉరికే వారిగ
మార్చిన మాటల శక్తి
కరుణామృత మూర్తి
నాటి తరం మహాత్మునిగా కీర్తి
నేటి తరానికి  స్వీకృతి
రేపటి తరం ఆలోచనల ఆకృతి
సత్యం అహింసల అభిలాషి
మనలో ఉండాలి
మననంలో ఉండాలి
తరతరానికి ఇంకా ఉండాలి
కదిలే ప్రవాహమై!
యెదలో స్పూర్తిని నింపాలి
గాంధీ మార్గమై!!

--పాల్వంచ హరికిషన్
   రామన్నపేట
   సెల్ః 9502451780
[08/04, 8:19 PM] Sharief Sir: 🌹కవితాగానం వారి పౌర్ణమి పోటీకొరకు🌹
అంశం: గాంధీమార్గం

1.కం:
గాంధీ మాటలు వినుమా!
బ్రాందీ మార్గమ్ము విడుము ‌ 
              బ్రతుకులు జెడురా
నాందీ పలుకులు నివియే
గాంధీ మార్గమ్ము వసుధ 
                ఘనతను గాంచెన్!

2.కం:
సత్యము కావును జగతిని
సత్యము పాటించు వాడు
                   సద్గతి నొందున్!
సత్యమె శాంతియు,కాంతియు
నిత్యము పాటించు మనెను
                     నిక్కము గాంధీ!

3.కం:
హింసా మార్గము వీడుము
హింసయె నీలోకమందు 
                  హీనము సుమ్మీ!
ద్వంసము జేయును జగతి న
హింసా మార్గంబె నెపుడు 
                  హితమనె గాంధీ!

4.కం:
చెంపను గొట్టంగ మరో
చెంపను జూపెట్టు మనెను
                    చిరునవ్వులతో!
చంపుట మూర్ఖము, మంచిని
నింపుటయే గొప్ప దనెను
                    నిక్కము గాంధీ!

5.కం:
నిరతము సేవా భావము
మరువకు నీమనసు నందు
                   మార్గంబదియే!
తరగని ధనమే త్యాగము
చెరగని చిరునవ్వనుచును
                    చెప్పెను గాంధీ!

6.కం:
దొంగతనము వద్దనె మీ
బంగరు బ్రతుకంత గంగ 
             పాలగు యనియెన్!
రంగుల జీవనమే కడు
పొంగారగ బ్రతుకు మనెను 
                పూజ్యుడు గాంధీ!

             " ప్రతిభారత్న "
        డాక్టర్. మహ్మద్ షరీఫ్
     సంగారెడ్డి. 9866560527.
[08/04, 8:25 PM] Vakula Vasu: కవితా గానం
శ్రీ శార్వరీ నామ సంవత్సరం
వకుళ వాసు
హన్మకొండ
అంశం-గాంధీమార్గం

శీర్షిక-🍃🌹 నవ కేతనం 🌹🍃

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని 
గడగడలాడించి... 

వినీలాకాశ చంద్రోదయం సాక్షిగా అర్ధరాత్రి 
నవభారతం ఉదయించె... 

స్వేచ్ఛా గాలులు జగమంతా వీచి స్వాతంత్ర్య పరిమళాలు పంచె... 

భావగీతాలు అన్ని దిక్కుల వ్యాపించి దేశభక్తిని చాటె... 

నవ భారత నిర్మాణానికై నేతలందరూ ప్రతినబూనె... 

భారతావని సత్తా చాటుతూ  నవ కేతనం ఎగురవేసె...

నూతనోత్సాహం తో తమ శక్తి యుక్తులను చూపె యువత... 

విద్యాభివృద్ధి తో విజ్ఞాన విపంచికలు అవని అంతా వీచె... 

ప్రజలంతా మేధాసంపన్నులై ప్రపంచాన్ని అరచేతిలో అమర్చుకొనె... 

కాని ఓ పక్క నిస్వార్ధ సేవలే కనుమరుగాయె... 

కుటిల కుతంత్రాలకు ఎందరో బలి అవుతూనేవుండె... 

ఎన్ని చట్టాలొచ్చిన అబలలపై 
వికృత చేష్టలు పెరుగుతూనె వుండె... 

ఇదేనా గాంధీ కోరిన సమాజం 
నెహ్రూ కాంక్షించిన స్వేచ్ఛ...

ఎప్పుడు ఎగురుతుంది అమ్మ బతుకుకు నమ్మకమైన జెండా... 

ఎప్పుడు రెపరెపలాడుతుంది బిడ్డల నవ్వుల విశాల బావుట... 

ఆ స్వేచ్ఛాయుత నిర్మల విపంచి వీచికను కాంక్షిస్తూ గాంధీ మార్గంలో పయనిద్దామా...

నవనవోన్వేష విజ్ఞాన మధుర ఫలాలు జాతికందిద్దామా... 

విశాల భావాల నిర్భయ జీవన 
గమనాల నవ కేతనం ఎగరేద్దామా.... 

అప్పుడు కదా ఊరూరా నిలుపుకున్న మన గాంధి విగ్రహం

 చిరునవ్వులు చిందిస్తూ శాంతిని పంచుతూనే వుంటుంది

🍀🌹 వకుళవాసు 🌹🍀
[08/04, 8:27 PM] Gundla Raju Sir: చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీకి

అంశం: *గాంధీ మార్గం*

కవితా శీర్షిక :  *శాంతి - ప్రేమ*

అవినీతి లంచగొండితనం
అహర్నిశలు తన రూపాన్నిమార్చుకుంటూ
వాతావరణంలో వైరస్ లా
పట్టి పీడిస్తోంది...

కుల, మత, జాతి, వర్గ వైషమ్యాలు
మానవ హృదయాలలో
మ్రానులవలె విస్తరించి
అనైతికతకు పాదులు వేస్తున్నాయ్...

స్వార్థం వేయి తలలతో 
పడగ విప్పి విషం చిమ్ముతూ
అరిషడ్వర్గాలను అష్ట దిగ్భందనంచేసి
అగ్ని పర్వతాలను సృష్టిస్తున్నది...

ధనిక, పేద వర్గాలు
ఎవరికి వారే యమునాతీరేయన్నట్లుగా
సమాంతర రేఖలా భూమి అంచులను
చేరు కోవడానికి వెళ్తున్నారు...

అన్నార్తులు, అనాథలు
నిరంతర శ్రామికుల్లా స్వేదం చిందిస్తూ
భూగోళం మీద పిపీలికంలా
వరుసలుకడుతున్నారు...

ప్రజాస్వామ్యం పరిఢవిల్లి
నవజీవన చైతన్యం దశ దిశలా
పరివ్యాప్తం చేయాలన్నా,
మానవుల్లో *మాధవున్ని*
దర్శించాలన్నా...
సత్యాహింసల పాశుపతాస్త్రం,
శాంతి ప్రేమల బ్రహ్మాస్త్రం,
మొక్కవోని ఆత్మ స్టైర్యం - *గాంధీ మార్గం*
అవసరం, అత్యవసరం
ఎప్పుడైనా, ఎక్కడైనా సదా ఆచరణీయం...

*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
[08/04, 8:29 PM] శ్రీకాంత్ కడార్ల Poet: కవితాగానం
********'**' ******'

అంశం:గాంధీమార్గం

పేరు:శ్రీకాంత్ కడార్ల




సత్యం, అహింస వంటి నమ్మిన సిద్ధాంతాలతో
సహయనిరాకరణ సత్యాగ్రహం వంటి ఆయుధాలతో
రవిఅస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
కునుకు లేకుండా చేసిన స్వాతంత్య్ర ప్రధాత
మాములు వ్యక్తినుండి మహాత్ముడుగా ఎదిగిన వైనం నుండి.... *పట్టుదలను*

కొల్లాయికట్టుకొని చేతకర్రపట్టుకొని
నూలు వస్త్రాలు వడికి మురికివాడల్లో
తిరిగి అందరిలో ఒకడిగా అతిసామాన్యుడిగా నడయాడిన
ఆయన నుండి *నిరాడంబరత్వాన్ని*

పల్లెటూర్లే పట్టుగొమ్మలని
పండించే రైతులే రాజులని
కన్నతల్లితండ్రులే ప్రత్యక్ష దైవాలని
తెలిపి ఆచరణలో చూపిన
బాపూజీ నుండి
*సమున్నత వ్యక్తిత్వాన్ని*
స్వాతంత్య్ర పోరాటంలో అడుగడుగు
అవరోధాలెదురైన నమ్మిన సిద్ధాంతం
వదలక గమ్యాన్నీ మరవక
నాయకుడిగా నడిపించిన తెగువ నుండి *దార్శనికనాయకత్వాన్ని*
ఇలా ఆ మహానీయుని అడుగడుగునుండి
నేర్వాల్సిన పాటలెన్నో ఎన్నెన్నో..

ప్రపంచపు గొప్పవ్యక్తుల్లో ఒకడుగా
నిలివగలిగి అస్తమించని కీర్తిని పొంది
మహాత్మ అయ్యారంటే
అనన్య సామాన్యమైన ఆయన వ్యక్తిత్వం
ఆకాశ సమానమైన ఓర్పు, ప్రతిభలే

తరాలైన వసివాడని చరిత కొనియాడదగిన నడత
సదా అనుసరణీయం
అప్పటికీ, ఇప్పటికీ, మరెప్పటికీ....
[08/04, 8:30 PM] Rama Kulakarni Hyderabad Poet: కవితాగానం 
   చైత్ర పౌర్ణమి కవితలపోటీ 
    రమాదేవి కులకర్ణి 
      హైదరాబాద్ 
     8985613123
   అంశం --   *గాంధీ*
----------------------------------------
                   *ఆత్మబలం*

ఆయుధమే చేబూనక 
సత్యమే సాధనగా 
తెల్లదొరల నెల్ల దునిమిన 
ధీశాలి,  అహింసావాది 
శాంతిదూత మనబాపూజీ .....! ! 
ఖద్దరు పంచ చేతి కర్ర 
వడలిన శరీరం 
సడలని ధైర్యం ....
ఆహార్యంగా ....!
త్యాగం జ్ఞానం సేవాభావం 
దేశభక్తే లక్షణంగా ..
వరలిన లక్షణ మూర్తి 
జగత్తుకే స్పూర్తి 
మన జాతిపిత గాంధీతాత ....! !  

చేసిన తప్పుల ఫలితంగా 
ప్రాణభీతిచే తల్లడిల్లుతోంది విశ్వం 
గుండుకు గుండెను చూపిన 
ఆనాటి ధైర్యం, సంకల్పంచే 
శత్రువుని గడగడ వణికించిన 
నీ ఆత్మబలం ఇప్పుడు కావాలి... !!
డిటాచ్డ్ విత్ అటాచ్డ్ అవ్వాలి 
ప్రకృతి దైవం అన్న మాట వంటబట్టాలి 
నీవు మళ్ళీ అందరినీ నడిపించాలి 
ఏదో రూపాన... !!!!!
[08/04, 8:31 PM] Mahender Javvaji: పేరు మహేందర్ జవ్వాజి
అంశం. గాంధీ మార్గం

అహింస సత్యమే తన మార్గం
పరిస్థితులేవైన సరే శాంతి యుతంగా ఉద్యమం చేసే గుణవంతుడూ  అందరితో సహనం గా నడుచుకునే
నమ్మిన సిద్ధాంత పరుడు
దేశ పోరాటం లో తన అబివృద్ది కి నాంది గ్రామ స్వరాజ్యమాయే
ఆయుధాలు వద్దు చర్చలు ముద్దని ముందు సాగిన మహనీయులు ఆయన
అందరి ఐక్యతె మనకు మేలన్నారూ మానవ సేవయే మాదవ సేవని సాగిన దృఢసంకల్పుడూ గాంధీ
 న్యాయ బద్దతే సాంప్రదాయ మార్గమని చాటిన గొప్ప వ్యక్తి
[08/04, 8:32 PM] +91 98480 54079: 🙏నమస్కారం 🙏
**********************
🎯🎯🎯🎯🎯🎯🎯

అంశం : గాంధీ మార్గం 

ప్రచురణ : 8/04/2020
         

ఓ మహాత్మా నీకు వందనాలు... 
నాటి నుండి నేటి వరకు నీ చరిత్ర అపూర్వము... 
ఎన్నో సమారాలు చేసావ్ 
అందరి ఎదలో అక్కటుకున్నావ్... 
పసి పిల్లలు అంటే నీకు ప్రాణం. అన్యాయాన్ని ఎదిరిస్తావు... 
అందరిని సమానంగా చూస్తావు
పేదలను ఆదుకుంటావు... 
 ధైర్యంగా పోరాడు తావు...
 నీ మార్గం శాంతి మార్గం.. 
 దేశం కోసం అందర్ని గడగడా లాడించిన ఓ మహాత్మా... 
 చివరికి ప్రజల కోసం అని 
తెల్ల దొరలను ఎదురించావ్... 
నీలో ఎన్నో సిద్ధాంతాలు.. 
నీలో నచ్చిన గుణం" శాంతి ", "అహింస ",  దెర్యం.... 
ఓ మహాత్మా ఈ పంచ భూతాల సాక్షిగా.. 
ఈ చల్లని గాలి ఈ నిండు పొర్ణమి సాక్షిగా చెప్తున్నా.. 
నీలాంటి మేధావులు ఉన్నంత కాలం ఈ వసుధలో విజయాలు... 
మా యువతకు కావాలి నీ బాట అని.... 
నీ బాటలో నడుస్తామని ఈ పొర్ణమి సాక్షిగా హామీ ఇస్తున్న... 

    ధన్యవాదములు.. 🌹


     🌸కవి పరిచయం 🌸

పేరు : ఇంద్రవత్ రాహుల్ 
         ( తెలుసు బాల కవి )
ఊరు : మల్కాపూర్ 
జిల్లా : ఇందూర్ /నిజామాబాదు 
మండలం : ఇందూర్ /నిజామాబాదు 
చరవాణి : 9848054079


💥🚩మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినoదుకు వృదాయ పూర్వక ధన్యవాదములు 🙏
[08/04, 8:39 PM] Sagarla సత్తయ్య Poet: కవితాగానం 
   చైత్ర పౌర్ణమి కవితలపోటీ 
    సాగర్ల సత్తయ్య
      నల్లగొండ
   7989117415
   అంశం --   *గాంధీ మార్గం*
----------------------------------------
                   *మహాత్మా! మళ్ళీరా!*


 మతముల పేరిట మనుజుల
 చితులను పేర్చెడు కుజనులు చెలరేగిరయా 
సతమతమయ్యెను భారతి
 వెతలను తీర్చంగ రావె వేగ మహాత్మా!

 
అవినీతి పెరిగిపోయెను
అవని పయిన నీతి దప్పి అన్యాయములే
అవలంబించెడి మనుజుల
 అవలోకించగ మహాత్మ యరుదెంచుమిలన్ 

 నిలువెత్తు స్వార్థమయ్యెను
 కలవారికె అందలములు కాంచు మహాత్మా 
 ఫలితము పేదకు అందదు
 పిలుపును మన్నించి రావె పేర్మిని బాపూ 

 నీ కలలు కల్లలయ్యెను 
వికలమ్మయె నాటి స్పూర్తి వేదన మిగిలెన్ 
 అకటకటా యేమందును? 
 సకలము గాపాడ నీకు స్వాగతమయ్యా!

 తడబడె  న్యాయమ్మిచ్చట
 బడితె గలుగు వాడి బర్రె వలె మారెనుగా 
 కడగండ్లు బాపి భారతి
 నడిపింపగరావె  నీవు నతులు మహాత్మా!

             - సాగర్ల సత్తయ్య నల్లగొండ
[08/04, 8:39 PM] Komandoori Neela Poet: కవితా గానం 
*శ్రీ శార్వరీ నామ సంవత్సర చైత్రమాస పౌర్ణమి నగదు బహుమతుల పోటీ*

పేరు: కె.ఇ.నిలమంగై
అంశం: *గాంధీమార్గం*  
తేది: 8/4/2020.
కలం పేరు: నీలా రంగనాధం
       *పద్య రూపంలో*
ఆ.వె1: మహికి స్వేచ్ఛనివ్వ మహితాత్ము జన్మించి
హింస నొదల మనుచు హితము చెప్పె
సత్య మార్గ మందు సాధించ స్వేచ్ఛను
నాయుధంబు వదల నాజ్ఞ యిచ్చె!

ఆ.వె2:భయము వదల మంచు భారతీయుల లేపి
పరుల వస్తువులను పార వేసి
దండి మార్చి చేసి ధరణీశు గుండెల్లో 
దడను రేపి నాడు ధర్మ ముగను!

ఆ.వె3: ఆంగిలేయు లంత యాగ్రహము పడగా
సత్య పథము నందు సాధకుడిగ
మార్గ దర్శనంబు మాహాత్ముడిగ చేసె
గాంధి  పేరు బడసె  ఘనుడు మహిన!!!

*నీలా రంగనాధం*
హామీ పత్రం
ఇది నా స్వీయ రచన
దేనికి అనువాదం కాదు 
ఎక్కడా ప్రచురింప బడలేదు.

[08/04, 8:43 PM] ఉప్పల పద్మ Poetess: తేది : 08-04-2020
నిర్వహణ : కవితా గానం (చైత్ర పౌర్ణమి కవితల పోటీ )
అంశం : గాంధీ మార్గం  

 శీర్షిక : *సంస్కరణ సేద్యం* 
         ******************

సత్యాగ్రహ బావుటాను చేపట్టి
చంపారన్ రైతుల ఉద్యమానికి 
ఊపిరులూదిన ధీరుడు  

భారతీయుల హృదిలో 
అహింస విత్తనాలు నాటి 
ప్రజాబలం ముందు 
బ్రిటీషర్ల నియంతృత్వం నిలువదని నిరూపించిన సాహసి  

ఒక చెంప కొడితే 
మరో చెంప చూపించి 
శాంతికి బాటలు వేసిన  బోధిసత్వుడు 

సత్యం అహింస శాంతి
ఆయన ఆచరించి చూపిన సన్మార్గాలు 
కానీ కాలశకటం వీటిని లాగలేక పోతుంది 
అహం గుప్పిట్లో..కాసుల వేటలో..
తలమునకలైన స్వార్థ సమాజం 
అవినీతి భేషజాల నడుమ 
గాంధీ విధానాలు గగ్గోలు పెడుతూ 
మంచి మనసులలో మౌనంగా రోదిస్తున్నాయి 
స్వాతంత్ర్యానికి అర్థం మరిచి విలువలకు నీళ్లొదిలి 
పబ్బం గడుపుతున్న నేటి సమాజోద్ధరణకు 
మళ్ళీ మళ్ళీ గాంధీలు పుడుతూనే ఉండాలి 
గాడి తప్పుతున్న వ్యవస్థలో 
సంస్కరణ సేద్యం గావించాలి   
 
     *- ఉప్పల పద్మ-*
         మిర్యాలగూడ 
చరవాణి  :8340933244
[08/04, 8:46 PM] Sandya Sharma Poetess: *కవితా గానం*
*చైత్ర  పౌర్ణమి కవితా పోటీలు*
*అంశం: గాంధీజీ మార్గం*
*పేరు : వై.కె.సంధ్యశర్మ*

*శీర్షిక: సత్యశోధన*
******************

చెరగని చిరునవ్వు వెనుక
అణువణువూ చెదరని ఆత్మవిశ్వాసం 
అంచెలంచెలుగా పేర్చుకుంటూ
అహింసో పరమోధర్మమః సూక్తాన్ని
సూత్రీకరించిన తీరు వేలాది కాంక్షలను
దర్శించిన దాయాగుణాత్ముడు
మహాత్ముడు మోహన దాసుడు

ఆత్మ శుద్ధి లేనిదే ప్రతి జీవిలో
సమైక్యత సాధించలేమని 
ధర్మ పాలన నడిపించ లేమని
సమిష్టి సాధనకు నిరంతరం నడయాడిన
నిర్మలుని నిత్య సత్యాగ్రహం
అవివేకులకు ఎల్లపుడూ
మార్గదర్శమే

రాగద్వేషాల రహితుడై
మనస్సులోనీ వికారాలను
తృణీకరించి బుద్ధిని సిద్ధితో జయిస్తూ
ప్రపంచ శస్త్రాలెన్ని ప్రయోగించినా
ప్రభాతుడై మేల్కోలిపే సమయ పాలనా దక్షత
గుండె గుండెకు అందాల్సిన చికిత్సే!

కాలానుగుణ మార్పులెన్నున్నా
ప్రాపంచిక కోరికలను త్యజించి
దేశమంతా నిరాకరణోద్యమ స్ఫూర్తి నింపి
జన జీవన స్రవంతిలో మౌన ముద్రతో
స్వచ్ఛత నింపిన ఆ ఆశయమెపుడూ
అత్యవసరమే అజ్ఞానాంధకారాన్ని
పారద్రోలుటకు!

నేటి స్థితుగతులెన్నున్నా నాటి మాట
బాపూజీ బాట అవలోకనంతో
అవలంబిస్తే అన్నార్తులే లేని
అవని కాదా... పాడి సీమలై
పల్లె పల్లవించదా... అణువుణువూ
అరుణోదయమై సత్యశోధనతో
భారతమాత మురిసిపోదా!
[08/04, 8:47 PM] Balloori Umadevi Poetess: కవితా గానం

 చైత్ర పౌర్ణమి కవితల పోటీ  పద్యములు
డా.బల్లూరి ఉమాదేవి
అంశము;గాంధీ మార్గం
      మార్గదర్శి

ఆ.వె: పోరు బందరందు పుట్టెనీ మాన్యుండు
       ప్రీతి పాత్రుడయ్యె జాతి కెల్ల
      జగతి మరువలేని జననేత మనబాపు
       కొలువ రండు వేగ  కూర్మి తోడ.

ఆ.వె:జాతిపితగ సతము సన్నుతి నొందిన
  జాతి పితయితండు  జగతి యందు
     సత్య  వాక్యమునకు చక్కని ప్రాధాన్య
     మొసగి నట్టి గొప్ప యొజ్జ బాపు.


ఆ.వె:భరతమాత యొక్క బానిసత్వము బాప 
      కంకణమ్ము  కట్టి  కదిలినాడు
     తెల్ల దొరల తోడ దీటుగా స్పందించి
        వెలుగు బాట చూపె విశ్వమునకు

 ఆ.వె:హింస కెప్పుడు  ప్రతి హింస కూడదటంచు
     చేతి లందు చూపి చేవ చాటి
     శాంతి మంత్రములను  జనులకు బోధించె  
    శాంతి తోడ తాను  జగతి యందు

ఆ.వె:కత్తి పట్టకుండ కార్య సాధకుడయ్యె
        భరత మాత యొక్క బంధనమును
       బాప జాతి  మెచ్చ   బాపుగ తానయ్యె
         చక్క గాను చూపె సమ్మె బాట.

ఆ.వె:నియమ పాలనమ్ము నేర్పే జనులకెల్ల
      నాచరించ శుభము లందు వచ్చు
     ననుచు  రుజువు చేసి నట్టిమాన్యుడితడు
      జాతి రత్నమగుచు  జగతి వెలిగె.

ఆ.వె:నడచు చుండ  జనులు నయముగా బాపూజి
       మార్గ మందు నపుడె మంచి జరుగు
     సకల జనులు మదిని  శాంతిని పొందుచు
      బ్రతుకు గడపవచ్చు వసుధ యందు.

ఆ.వె:ధర్మ మాచరించి దార్శనికుండయ్యె
       శాంతి బోధ చేసి సాగె దివికి
      బాపు  చూపినట్టు బాటలో సాగిన
       సకల సౌఖ్య  మబ్బు జనుల కెల్ల.


ఆ.వె:భరత జాతి కొరకు ప్రాణముల్  వీడుచు
     నమరు డయ్యె నీత డవని యందు
     వారు చూపినట్టి పథము ననుసరించి
      సాగు చుండ కలుగు సౌఖ్యమిలను
[08/04, 8:51 PM] కోమటి మత్స్యగిరి: "పౌర్ణమి" కవితల పోటికై



*సక్సెస్ మంత్ర-గాంధీ మార్గం* 


అన్యాయాన్ని
అధర్మాన్ని
ఎదురించాలంటే
కత్తులు బరిసెలు
లాఠీలు తూటాలతోపని లేదని
శాంతి అహింసలే...
ఆయుధాలని
నిరూపించిన కార్యసాధకులు
చరకా రాట్నమై
తెల్లోళ్ళకి చరమగీతం పాడిన
భారత జాతిరత్నం
'దండి'గా సత్యాగ్రహాలెన్నో నడిపి
చెడు పై...
మూడు కోతుల సందేశాన్ని అందించిన
అహింసా సిద్ధాంతి
పోరుబందరు 'పోరు'బిడ్డ
"గాంధీ"జీ మార్గమే
ప్రపంచానికి
సక్సెస్ మంత్రం....
అదే నేటి యుద్ధతంత్రం..!


కోమటి మత్స్యగిరి (ఛత్రపతి)
[08/04, 8:52 PM] Tirumalesh KJYK 2/32: కవితా గానం
************
చైత్రమాస పౌర్ణమి నగదు కవితల పోటీ

అంశం:గాంధీ మార్గం
శీర్షిక: మన బాపూజీ
తేదీ:8/4/2020

పేరు:ఉప్పరి తిరుమలేష్

*శీర్షిక:మనబాపూజీ*

ఆయన శాంతికి చిహ్నం
సహనానికి ప్రతిరూపం
నడిచేె ఉద్యమకాంతి
నడిపించే నవచైెతన్య స్ఫూర్తి!!

తాను నడుస్తూనే 
నవసమాజాన్ని నడిపిన తీరు
ఆంగ్లేయుల గుండెల్లో రేెపెను బేజారు!!

బానిసత్వంపై ఎత్తిన కలం
సమానత్వానికే సందించేను శంఖారావం
శాంతికి చిహ్నం తనచిరునవ్వు!!

 పక్కలో బల్లెమై 
శాంతిని కాంక్షిస్తూ
అశాంతిని అంతమొందిస్తూ
భారతావని శాంతి గీతం బాపూజీ!!

నడకకే నడత నేర్పుటకై
యువతని సన్మార్గంలో నడిపిన
శాంతిమార్గం బాపూజీ !!

ఉప్పును చేతబూనినా
నవభారత నిర్మాణకాంతి 
సాతంత్రోద్యమ శాంతివార్ధి
అణువణువునా నింపెను దేశభక్తి!!

ఖద్దరు వస్ర్తాలను ధరించిన
భారతదేశ ప్రజాస్వామ్య వారధి
ప్రాణాలను త్రుణప్రాయంగా ఉంచి 
పదవులు కోరని పావన మూర్తి బాపూజీ!!

విదేశీయుల మన్ననలను పొంది
స్వదేశానికి వెలుగు నింపెను
స్వాతంత్ర్య ఉద్యమ దృవతార భాపూజీ!!

*ఉప్పరితిరుమలేష్*
     9618961384
[08/04, 8:54 PM] Tulasi Venkata Ramana: శార్వరి నామ సంవత్సర చైత్ర మాస పౌర్ణమి ...నగసదు పురష్కార ..పోటీ...కవిత.

పేరు :తులసి వెంకట  రమణా చార్యులు.
అంశం: గాంధీ మార్గం

శీర్షిక: ఓ మహాత్మ మరో మారు రా!!
------////-------////-----///
మనిషికి నమ్మకమే పునాది
సంకల్పమే లక్ష్య సాధనకు నాంది
సత్యాన్ని నమ్మి శాంతి తోనే సమస్యకు పరిష్కారం అని నమ్మిన ఆదర్శవాది గాంధీ
నల్లజాతి వాడవాని నిందించిన
తెల్ల దొరల సామ్రాజ్య ఆధిపత్య పోరును అంతమొందించుటకు..
గాంధీ ఎంచుకున్న మార్గమే సత్యాగ్రహం... 
ఓర్పుకి మారు పేరుగా నిల్చిన సామాన్య వ్యక్తీ ..
మమతను పంచుతూ ..మానవత్వం చాటుతూ.....
ఎన్ని విమర్శలు వచ్చిన ఎన్ని వడిదోడుకులు వచ్చిన ...
ఎదురు నిల్చి సత్య వాక్కు తో
పొరుసల్పి ...కఠోర పరిస్థితులు ఎదురుకొంటూ...
సత్యమేవ జయతే అన్న నానుడికి చిహ్నం గాంధీ మార్గమే!..
దేశ స్వేచ్ఛ కోసం ...
ఎన్నో మార్గాలకు గాంధీజీ చూపిన  బాటయే శిరోధార్యం గా నిల్చి ...
అతివాద మితవాద వర్గాలకు తోడ్పాటు అందిస్తూ..
విమర్శలు వెల్లువెత్తుతున్నా..
శాంతియే శరణ్యం అని నమ్మిన నర నారాయణుడు..గాంధీయే
ఉప్పు సత్యాగ్రహం... ఒక ఉప్పెనగా నిల్చెను...
మరో అడుగు ముందుకేసి గాంధీజీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు శాంతి బాటలోనే నడిచి....
విజయ బాహుటా ఎగురవేసిన ఘనత మన దేశాంద్దే .
సంకల్ప దీక్షనే గాంధీ ని మహాత్మా గా మార్చింది
చరిత్ర పుటల్లో నిల్పింది 
ప్రతి కరెన్సీ నోటుపై..తానై.
ప్రతి భారతీయ హృదయంలో ఆరాధ్య దైవం గాంధీయే ..
అతని గమ్యం మార్గం..అంతా దేశమాత స్వేచ్చనే
హితము కోసం కొంచెం ఆగ్రహం తప్పదు... అయినా చిరు దరహాసం తో  వాక్ పటిమతో... కలుపుకొని వెళ్లే మనస్సే ...అతని ఆశయ సాధనకు అండగా నిల్చింది
అదే మన సత్యాగ్రహ విజయ రహస్యం సుమా!!.
పదవులను ఆశించకుండా...
పెదాలపై ఆ చిరు నవ్వే ..మణిభూషణమై
అందరి నోటా ..తాతగా పిలువబడే  వన్నె కాడు... ఎన్నటికీ మరవునని శాంతి స్థాపకుడు..
ధర్మం ఎరిగిన  త్యాగశీలి
తరాలు మారినా ...చరిత్ర కు సజీవంగా నిల్చేది గాంధీ మార్గమే సుమా!
ఆచంద్రతారాక్కం గాంధీ బాటయే ఉండాలని..
ఆశయ సాధనకు మళ్ళీ గాంధీయే రావాలని..
దేశానికి నవతరానికి శిరోధార్యం గాంధీ మార్గమే శరణ్యం..ఇదే సత్యం..
ఓ బాపు కరుణ చూపు మరో మారు...
ఆచరణకు నీ అడుగే నాంది..
నీ సంకల్పమే మాకు మనో ధైర్యం.. ఓ మహాత్మా!!
[08/04, 8:55 PM] విజయ లక్ష్మి యాదాద్రి: నా కవితా శీర్షిక:*గాంధీమార్గం*
----------------------************-----

ఓ బాపూ!నువ్వేమి భోధించావొ నే  తెలుపగలనా?!
ఓ మహాత్మా!నువ్వు ఎన్నెన్ని సాధించావొ వివరించగలనా?!
ఓ జాతిపితా!ఎలా జయించావొ వర్ణించగలనా?
ఓ అహింసావాదీ!నీ సన్మార్గాన సాగుతూ ధన్యతనొందగలను.

సాధారణ మానవుడిగా పుట్టి
అసాధారణ మహాత్ముడిగా జీవించావు
స్వతంత్రపోరాటాన కాలు పెట్టి
తెల్లొల్లనె వెళ్ళగొట్టె దారి చూపిoచావు
స్వదేశీఉద్యమాన్ని ప్రజల అభిమతం చేసి 
సత్యాగ్రహఆయుధాన్ని శక్తివంత0 చేశావు
అహింసను మించిన ఆయుధం లేదు-         సత్యాన్ని మించిన సాధనం వలదన్నావు

కర్తవ్యమె మానవహక్కులకు మూల0-          మానవత్వమనె గ్రంథపుటలు తెరవమన్నావు
ఉత్తమ భారతతత్వచింతనకు కొత్త వర్ణాలద్దావు
స్వాభిమానసంపాదన  స్వయంకృషితొ సాధ్య0-
సధాలోచనల పరిణామమే పరిపూర్ణనరుడన్నావు
ఓటు సత్యాగ్రహం ప్రజల ఆయుధాలు-         ఐక్యతా బలముంటెనే పోరాటం సఫలమన్నావు

సత్యాగ్రహ జీవితసౌధానికి 
సత్యం ప్రేమలే పునాధులన్నావు
ఇతరులనెలా ఆకట్టుకొవాలొ గాక ఎలా ప్రేరేపించాలొ యొచించావు.
ఆత్మను చంపేతాగుడువ్యసనం             పాముకాటు కన్న ప్రమాదమన్నావు
సనాతన హిందుధర్మం-
సకల మతాల సమ్మతం
హిందూమత ఔన్నత్యం-
అంటరానితన నిర్మూలన0...
వంటి విరుద్దభావాల రైలుపట్టాలపై
నీ మానవతాబండిని సమర్థవంతంగా నడిపావు

అవినీతిసంపాదన 
సౌశీల్యంలేని వ్యాపారం అరాచకమన్నావు
ఉగ్రవాదం దేవుని సృష్టిలో పాపo-
కుష్టువ్యాధి దేవుని శాపం కాదన్నావు 
మానవత్వంలేని శాస్త్రజ్ఞానం నిష్ఫల0     -రామరాజ్యమంటి ప్రజాపాలన కావాలన్నావు

ప్రకృతిని ప్రేమిస్తూ                      వాతావరణమార్పుల గమనించాలన్నావు
శాకాహారాన్నిభుజిస్థూ మూగజీవాల రక్షించమన్నావు
అబద్దమూ హింసె- దాన్ని  మానెయమన్నావు

*నా జీవితమే నా సందేశం* * అని త్రికరణశుద్ధిగా భావించి ఆదర్శంగా జీవించిన ఈ యుగ గౌతమా!
నీ పాదముద్రలను జగమంత  వేసిన సత్యసందాత లోకనాయక!
ఒక్కవ్యక్తి ఇంత బహుముఖ శక్తివంతుడా!
అని ఆశ్చర్యపరిచే అద్బుత  వ్యక్తిత్వశీలుడా !

నీ సత్యవచనం సత్ప్రవర్తన ఆచరణ ధృఢసంకల్ఫాలు అపూర్వాలు
నీ త్యాగధనం ప్రేమగుణాలు అమూల్యాలు
నీ సత్యమార్గాన సాగే మనుషులే ధన్యులు.

:*వల్లాల విజయలక్ష్మి* (టీచర్)*,,,సిల్క్ నగర్,,ఆలేరు పట్టణం,,
యాదాద్రి భువనగిరి జిల్లా
[08/04, 8:57 PM] Nimma Ramreddy Poet: // ఓ మహాత్మా మళ్లీ రావా  🙏 //
----- నిమ్మ రాంరెడ్డి

ఓ మహాత్మా 
ఒక చెంపపై కొడితే రెండోది చూపమంటివి
రెండోది చూపితే తలను తీసి మెడలో వేసుకునే రక్తపిపాసుల భోక్తల దారులు
నా దారెటు

ఓ మహర్షీ
అణుబాంబులే సంపదలై
ఆక్రమణలే ఆకలియై
మతం మారణ హోమానికి ఆజ్యమై
అగ్రాధిక్యతకై ఎగిసిపడుతున్న పర్వతాగ్నుల్లో 
అహింసే మంచు జల్లంటివి
మేఘాలే లేని ఆకసంలో ఎక్కడని వెతికేది

ఓ దివ్యజ్యోతీ
క్రోదం ద్వేషం పగ ప్రతీకారాల 
పీడనా క్షేత్రాలే అంతట
శాంతి సహనపు వజ్రపు తొడుగులు లేకుండా రమిస్తున్న వికృత చిత్తాలకు 
పూర్ణబింబమేల గోచరం
పచ్చిగడ్డే భగభగ మండుతుంటే
పావురాన్నెట్ల నిలిపేది

ఓ యుగ పురుషా
మతోన్మాద ఆవిర్భావ పురిటినొప్పులతో బాధపడుతున్న భూమాతకు 
సామరస్య రసమిచ్చే సుశ్రుతుడెక్కడ

ఓ మహాత్మా
ఈ విభజీకృత ఖండిత గీతలలో గీతాసారం పోసేదెవరు
గుండ్రని భూగోళాన్ని గుప్పిట పట్టేదెవ్వరు

ఓ మహాత్మా మళ్లీ రావా 
🙏
[08/04, 8:58 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక :  గాంధీమార్గం
కవితా సంఖ్య: 04
తేదీ: 07/04/20

అల్లకల్లోల కరాళనృత్యమే సమాజం
మానవతను మట్టికరిపి
అమానుషత్వపు  దారుణాలే
నేలరాలుతున్న సామాజిక నైతిక విలువలను
దోసిట పట్టి నాయకత్వాన మోయను ఓ గాంధీ రావాలి
స్వార్ధపు సంకెళ్ళను తెంచి
సమసమాజ స్థాపనకై
గాంధీ మార్గం అవసరం
మనుషులలోని క్రూరత్వం
పైశాచికం తుదముట్టించేవరకు
కావాలి గాంధీ మార్గం
నిరాడంబరతో ఆకట్డుకొని
చెప్పినదే చేసిన గాంధీ 
ఒక్కతాటిన నడిపిన సమర్ధుడు.
ఎవరి కెవరు ఆత్మ విమర్శ తో
ప్రక్షాళనమయ్యే వరకు గాంధీ మార్గం ఆచరణీయం
పాతరోజుల ఆత్మీయతలను
వెన్నెలలా పంచుతూ
దేశభక్తి హృదినిండా పరిమళిస్తే
ప్రతి ఒక్కరు గాంధీనే
 దేశమాత కనుల ఆనంద జ్యోతి

                          వినీల
[08/04, 9:02 PM] Swarna Samatha Poetess: **కవితా గానం **

పేరు:స్వర్ణ సమత
ఊరు:,నిజామాబాదు 
అంశం:గాంధీ మార్గము  
శీర్షిక:మహాత్ముని బోధ  

**మహాత్ముని బోధ **

**అహింస ** తో అక్కున చేర్చుకొని  
**ఆత్మీయ** త ఆభరణమై 
**ఇక్కట్ల**  ను ఇష్టంగా భావించి  
**ఈప్సితం**  కొరకు ఎదురీది  
**ఉత్కంఠ**  తో ఉప్పుసత్యాగ్రహం  
**ఊరట**,నిచ్చే భారత జనులకు 
**ఎరుక ** తెలిపే శాంతియుద్ధం  
**ఏమరుపాటు **  లేని జాతిపిత  
**ఐకమత్యమే**  మహాబలమని  
**ఒద్దికగా **  ఒకటై  సాగిన  
**ఓర్పుతో ** నేర్పు వహించిన  
**ఔన్నత్యమే**  సాన్నిత్యమని  
**అందరిని**  ఏకం చేసి 
**అంతః కలహాలను** రూపుమాపి  
ఆహా ! అనిపించారు  
అందరిని మురిపించారు  .
[08/04, 9:07 PM] పెందోట Venkateswarlu: చైత్ర పౌర్ణమి కవితల పోటి
అంశం:  గాంధి మార్గము
కవితా శీర్షిక : కొత్త పద్ధతి
 
ఆ.వే. సత్య ధర్మ నీతి సత్సీలుడైనట్టి
గాంధి రాజకీయ వాది కాగ
దేశ బాని సత్వ దిగులునే బాపగా
ముందు నిలిచి నాడు మోదమీయ

2. ఆవె. కొత్త పద్దతంటు కోరి తెచ్చిన వాడు 
ఆయుధముల వూసు నసలె లేదు
సత్య ఆగ్రహంబె సక్క నైనది యంటు
మార్గ మొకటి వేసి మహికి జూపె

3. ఆవె.  నాడు గెలిచినట్టి నరుదైన మార్గాన్ని
దులిపి తెచ్చి నము గలము విప్పి
గాంధి మార్గ మెపుడు గదిలించు రాజ్యాల
తెలముగాణ సాక్షి తేటపరిచె

4. ఆవె.  నిన్న నేడు రేపు నెపుడైనను గాని
గాంధి మార్గ మొకటె నాంది యగును
ఆచరించినంత అధ్భుత విజయాలు
ధర్మ మెపుడు కూడ ధరణి  వెలుగు

5. కం. బలమున్నను లేకున్నను
గలమొక్కటి మెండు గున్న కదులును గాదే
నిల సత్య ధర్మములకు
పులకించెడు దేశ మిదియె పుడమిన నెపుడున్

పెందోట వెంకటేశ్వర్లు
సిద్దిపేట 
జ. సిద్దిపేట
9440524546
[08/04, 9:09 PM] వేంకట కృష్ణ ప్రగడ,విశాఖపట్నం 
కలం  : "కృష్ణ" కలం: కవితా గానం
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం 
08.04.2020
అంశం : గాంధీ మార్గం

శీర్షిక : మనసు మాటలు 

గాంధీ నడచిన మార్గాన్ని తనువుతో తడిమిన 
నా మనసుకు రెండు పాద ముద్రలు తాకేయి
సత్యం అహింస మా పేర్లు అని అవి తెలిపాయి ...

యుగాలు మారినా తరాలు మారినా
మారనిది మాత్రం ఒక్క సత్యం 
సత్యమేవ జయతే నా వాక్యం
అంటూ మొదటి పాదం మెత్తగా పలికింది ...

నమ్మితే ఇది సత్యం, సృష్టిలో అత్యంత పాపం
ఓ మనిషి మరో మనసుని హింసించడం
అలా అహింస అన్ని ధర్మాలలో ఉత్తమం 
హింసా మార్గం వద్దని బుద్ధి చెబుతూ రెండో పాదం ...

ఉదయ అరుణం చూస్తూ అస్తమించిన 
అమ్మ ఆరాధన గుర్తొస్తూ
ఆ ఆరాధనలో అహింసా మార్గం ప్రధమ పుష్పం 
నిగ్రహం దయ క్షమ ధ్యానం తపస్సు జ్ఞానాలతో
మనసుల్ని బాధించక చెప్పే సత్యం అష్టమ పుష్పం ...

ఏమిస్తే తిరిగి అదే ఇచ్చే ప్రకృతి సహజ ధర్మం గుర్తొచ్చి
శరత్కాల వెన్నెలంటి మల్లెల మాసం పువ్వులంటి
చల్లని తెల్లని జీవనం కోసం గాంధీ దారిన తలొంచి
సాధనతో సాధించలేనిది ఏదీ లేదని 
నమ్ముతూ నడుస్తూ నేను ...

                                   ... ✍ "కృష్ణ"  కలం


హామీ పత్రం :
నేను ఈ కవిత ఈ శ్రీ శార్వరీ పౌర్ణమి కవితా రాగం కవితల పోటీ కోసం రాసినది. 
ఇది నా స్వీయ రచన. అనుకరణ కాపీ కాదు.
[08/04, 9:11 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
చైత్ర పౌర్ణమి కవితల పోటీకి
తేదీ::08-04-2020
పేరు:;వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం::ఓ మహాత్మా ఓ మహర్షీ!
::::::::::::::::::::::::::::::::::::::
అహింసా సత్యాగ్రహాలతో
భరత మాత దాస్య శృంఖలాలను తెంచిన సాహసం!
ప్రపంచ దేశాల్లో మలయజంలా
గుబాళించిన మానవతా సందేశం!

అర్థ రాత్రైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లు చేరుకోవాలనే సంస్కార హృదయం!

కులమతాలకు అతీతమైనది
మానవతా కులమని చాటిన ఔన్నత్యం!
అహింస పరమ ధర్మమని బోధించిన
అపర బుద్ధభగవానుని ప్రతి రూపం!

సత్యం శివం సుందరం ఏనాడూ వాడని విలువల సుమహారమని
ఎరుక పరచిన సాక్ష్యం!

బాపూ!
ఇవే కదా నీవు నమ్మి ఆచరించిన
జీవన సూత్రాలు !
సత్యం అహింస సత్యాగ్రహ ధర్మాన్ని
యుగ ధర్మం చేసిన మహాత్మా!

బోసి నవ్వుల పాపాయి వంటి స్వచ్చమైన మనసుతో
శాంతి సహనం సమానత్వం లక్ష్యంగా
ప్రగతి పథంలో నడిపేందుకు
దేశం రామరాజ్యం కావాలని 
అనుక్షణం తపించిన జాతిపితా!
మా కోసం మళ్లీ ఒకసారి జన్మిస్తావు కదూ!
నీవు కోరుకున్న విలువలను 
మాలో పాదు చేస్తావు కదూ!
ఓ మహర్షీ!
నీలాంటి గొప్ప వ్యక్తి ఈ భూమి మీద నడయాడంటేనే
ఆశ్చర్యపోతుందన్న ఐన్ స్టీఫెన్
నీవు నడయాడిన ఈ నేలను కళ్ళకద్దుకోవాలన్ప నెల్సన్ మండేలా ఆరాధనను తల్చుకుంటే 
మా హృదయం పులకించి పోతుంది!
ఈ విశాల విశ్వంలో నీ చరిత్ర అజరామరం!
నీవు నడయాడిన ఈ నేలపై పుట్టిన
మా జన్మ ధన్యం!
[08/04, 9:13 PM] Swarna Latha Poetess: కవితా గానం వారి పౌర్ణమి పోటీలకు
*****************************

అంశం........గాంధీ మార్గం నేటి సమాజానికి ఆచరణీయమా
పేరు.........స్వర్ణలత
ఊరు........మంచిర్యాల
తేదీ..........08/04/2020
శీర్షిక..........ఆచరణీయమే సదా
..
సత్యం అహింస అంటూ భరతమాత
తలరాతను మార్చిన విధాత
తెల్లవారిని తెల్లమొహం వేయించిన
సత్యాగ్రహం ఆయన ఆయుధం
ముంజేతి కంకణానికి అద్దమేల
సదా గాంధీ మార్గం ఆచరణీయమే గదా
మహాత్ముడు మహోన్నతుడు...
ఆయన అహింసా సిద్దాంతం
కాలాతీతమే కదా...శాంతియుత పోరాట పంథా...
పలికింది స్వాతంత్ర్య సాధనకు నాంది
ఖద్దరు ధరించి నిరాడంబరుడై
స్వదేశీ ఉద్యమానికి ఊపిరిలూదాడు
ఇప్పటి స్వచ్ఛభారత్ కార్యక్రమం
ఆయన మొదలుపెట్టిందేగా

చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలనుకునే
హింసా ధోరణి కలిగిన ఆధునిక యువత
ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపితే
రెండూ వాయించిపోయే గడుసు పిండాలు
విదేశీ ఉత్పత్తుల మోజుతో పాశ్చాత్య పోకడతో
చిరిగిన దుస్తులను బ్రాండెడ్ ఆంటూ
బండెడు డబ్బులు తగలేసే ఆధునిక యువత
స్వదేశీ వాడగలదా క్విట్ ఇండియా అనగలదా

అయినా ఎక్కడో మిణుకు మిణుకు మనే ఆశ
ఈ కరోనా వేయించిందిగా ఒక వెనుకడుగు
తిరోగమనం దిశగా..
బాపూ గొప్పతనం తెలుసుకుని ఆచరిస్తారేమో
గాంధీ మార్గం...ఆచరణీయమే కదా సదా
[08/04, 9:14 PM] Gummannagari Balsaraswati: కవితా గానం కోసం
****************
శీర్షిక:

సదా అవసరం...!!
****************

సత్యాన్నే పలుకాలని,
"సత్యమేవ జయతే"అన్న బాపూ  దృఢసంకల్పం..
దాన్ని బలపరుస్తూ...
పదం పదం కలిపి,
కదం తొక్కింది కదా...
ఆనాటి భారతం...
చివరకు అదే సత్యమైంది కదా...!!
అహింసనే ఆయుధం కావాలంటూ,..
పిలుపునిచ్చిన ఆ ఒక్క గొంతుకే గదా...
అశేష భారతావని కోట్ల గొంతుకలను
ఒక్కటి చేసి,
శత్రువు గుండెల్లో
గునపాలు దించింది..!
చివరకు అహింసే గెలిచింది కదా...!!
  అతి సాధారణ నిత్యావసరమైన "ఉప్పు"
సత్యాగ్రహం...నిప్పు కణిక లను రువ్వి,
దండి యాత్ర ,దండయాత్రగా మారి,
తెల్లదొరలకు చల్ల చెమటలు పట్టించింది..ఆయన దార్శనికత్వం లోనే కదా..
జగజ్జేతను జయించి,
పరోక్షంగా జగద్విజేతగా
భారతం నిలిచింది..
శత్రువు ను కాదు...
శతృ లక్షణాలను వ్యతిరేకించు...అన్న ఆయన మార్గం అందరూ అనుసరిస్తే,
ప్రపంచమంతా
శాంతి సౌఖ్యాలు కాకుండా,
విద్వేషాలకు ఆస్కారం ఉంటుందా...
సర్వ మానవ సౌభ్రాతృత్వం
ఆయన మరో మార్గం..
అనుకరిస్తే,
లోకంలో 
సుఖ సంతోషాలు కాకుండా
కష్టాలూ... కల్మషాలూ
కనబడుతాయా...
అందుకే,
మానవాళి మనుగడ
ఉన్నన్నాళ్లూ...
గాంధీ మార్గం...
సదా ఆచరణీయం...

_____జి.బాల సరస్వతి,
సిద్దిపేట..
[08/04, 9:21 PM] రామబుద్దుడు: M. Rama buddhudu, 9959539499, chanda nagar, hyderabad. 

       గాంధీ మార్గం 

మహాత్ముడు చెప్పిన మహనీయసూత్రాలు కోకొల్లలు 
సత్యం,  అహింస, అపరిగ్రహం ఎన్నో ఎన్నెన్నో 
కండబలాన్ని మనోబలంతో ఎదుర్కోవడం 
నోటి దురుసును సహన బలంతో ఎదుర్కోవడం 
పరిస్థితి ఏదైనా పరమ నిష్ఠతో 
పోరాడటం 
భయమన్నది కించిత్తు లేకుండా హృదయాన్ని సహజంగా ఆవిష్కరించటం 
ఒక్క పిలుపుతో కోట్లమంది కదలి 
స్వాతంత్ర కదనరంగాన దిగిన చరిత్రే నిదర్శనం 
గ్రామ స్వరాజ్యం, స్వదేశీ ఉద్యమం 
ఎన్నో విషయాలు నీరుకారిన 
ఇప్పటికి ఎంతో ప్రాచుర్యం పొందిన 
నిరాహార దీక్ష ఉండనే ఉంది 
గాంధీ సూత్రాలు అతిగా దుర్వినియోగం అవుతున్నది ఒక్క రాజకీయాల్లోనే 
ఆయననామం లేకుండా ఈరోజు రాజకీయమే లేదు 
కానీ ఆయన స్పూర్తితో రాజకీయం నడిపిన నిల్సన్ మండేలా ఒక అద్భుతం 
అన్ని సౌకర్యాలు ఉండి కొన్ని 
రోజులు "కరొన"తో ఇంట్లో ఉండాలంటే గిలగిలా కొట్టుకుంటున్నాం
కానీ "మండేలా" గారు 
కాళ్ళు కూడా చక్కగా చాపలేని  ఒక చిన్నగదిలో 27 ఏళ్ళు జైలు జీవితం గడుపుతూ ప్రతిరోజూ పోలిసుల చిత్రహింసలు భరిస్తూ 
అధికారం సాధించి అద్యక్షుడై కూడా 
జైలు కాలంలో నోటిలో మూత్రం పోసిన జైలర్ను  కూడా 
క్షమించడానికి కారణం
ఆయన పాటించిన గాంధీ మార్గమే 
"లూథర్ కింగు"కు గాంధీ స్ఫూర్తి 
హింస, ఉగ్రవాదం, దౌర్జన్యం, అరాచకం పెల్లుబికిన ఈకాలానికి 
నిజంగా తారకమంత్రం 
గాంధీ మార్గం 
మహాత్మా మరోరూపం ధరించు 
మాకు మార్గం చూపించు
[08/04, 9:24 PM] Kalva Rajaiah: కవితాగానం 
శీర్షిక   గాంధీ మార్గం 
రచన  కాల్వ  రాజయ్య 

ఆటవెలది 
1
సత్య మార్గ మందు సాధించు కార్యము 
సహనమెంతొ నీకు సహకరించు 
క్రోధమెక్కువున్న కొంపలు ముంచును 
నిజము దెలిసి నడువు నీతి వంత 

2 ఆ  వే 

నాడు హింస లేక నాయకత్వముజేసి 
నిరకరించె సాయ మరువ జూపి 
భరత మాత యుక్కు బంధాలు  విడిపించ 
శాంతి మార్గ మెంతొ సహకరించె 

3 ఆ వే 

సత్యమెప్పుడైన శాంతిని చేకూర్చు 
నాడు నేడు ననియు తేడ లేక 
కాలమెంత నైన కఠినమ్ము జూపిన 
ఓడి పోదు సత్య మొదిగి యుండు 

4 ఆ  వే 
నాడు నడుచు తోవ న్యాయంగ    నుండెను 
పాత రోత యంటె పాడి దప్పు 
అలవరించు  కొనుము యానాటి పద్ధతి 
నిన్ను నడుపు నదియు నిజము గాను

5 ఆ వే 
హింస విడిచి యువత హంసల బతికియు 
చెడ్డ దారు లన్ని యడ్డ గించి 
కదలి ముందు నడచి కార్యంబు  జేసిన 
నవసమాజమంత నవత రించు